Saturday 21 March 2015

Telephone English మర్యాదలు part 1 - Candy #8


సందర్భాన్ని బట్టి కొన్ని sentencesని గనుక మనం నేర్చుకున్నట్లైతే అవి automaticగా మనకు మర్యాదలతో పాటు confidenceను పెంచుతాయి. ఈ పోస్టులో ఫోన్ use చేసేటప్పుడు commonగా వాడే example sentences వ్రాయబోతున్నాను. వీలైతే ఈ వాక్యాలను  by heart చేసి Contextually వాడొచ్చు. So get ready!!!
  • మీరు ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు మొదట మీ పేరు చెప్పి ఫలానా వారితో మాట్లాడాలని అనుకుంటున్నాను అని మొదలు పెట్టండి. 
    • Hello, I am Chandu, May I speak to/with Reena (or)
    • Hello, I am Chandu, I would like to speak to Reena, 
  • అదే మిమ్మల్ని ఎవరైనా Can/May I speak to/with Chandu అని అడిగినట్లైతే 
    • మీరే చందు ఐతే Yes, Chandu speaking అని గాంభీరంగా చెప్పొచ్చు. 
    • In case if you are not Chandu then,This is Raghu, Chandu is not around. May I take a message  అని మర్యాదగా వారి message తీసుకోండి. 
  • ఎదుటివారు ఫలాన xyz message pass చెయ్యగలరా అని అడిగితే 
    • Yes, I would be happy to pass this message అంటూ ఉత్సాహంతో అడగండి.  
  • మీరు పదిమందిలో ఉన్నప్పుడు ఫోన్ కాల్ attend చెయ్యాల్సి వస్తే
    •  I am sorry, I have to take this call అంటు పక్కకు వచ్చి మాట్లాడండి. 
  • మీరు దార్లో ఉన్నప్పుడో, కార్లో ఉన్నప్పుడో ఫోన్ కాల్ వచ్చి మీరు మాట్లాడలేకపోతే ఈ విధంగా చెప్పొచ్చు.
    •  I am on the way home, could you please call me after half an hour?  (or)
    • I am on the way to office/bank/market, can I call back you after half an hour?
  • మీకు missed call వచ్చింది. చేసినవారెవరో మీకు తెలియదు, మీరు వారికి callback చేసినప్పుడు, 
    • Hi, I missed your call(s), may I know who is this?  అని మీ మర్యాదను చాటండి. 
Appendix : 
  • By heart : బట్టీ పట్టడం
  • Contextually : సందర్భానుసారంగా
  • Around : చుట్టుప్రక్కల
  • In case : ఒకవేళ
  • Speak to vs speak with : ఇక్కడ speak to లేదా speak with రెండూ వాడొచ్చు. 
  • home vs to office : To Home అనేది సాధారణంగా కనిపించే common error. I am going to Chennai అన్నప్పుడు to Chennai అంటూ to ని ఏవిధంగా ఐతే Chennai కి చేరుస్తారో అదే విధంగా Home కి కూడా to చేర్చి, I am going to home అంటుంటారు. ఇక్కడ I am going home అనడం సబబు. Homeని adverb గా వాడటం వలన to ఎగిరిపోతుంది. అదే విధంగా నేనింటికి వచ్చేసాను అని చెప్పడానికి I am home  అని చెప్పచ్చు. 
  • Sentences Used
    • Hello, I am Chandu, May I speak to/with Reena? 
    • Hello, I am Chandu, I would like to speak to Reena?
    • Can/May I speak to/with Chandu?
    • Yes, Chandu speaking.
    • This is Raghu, Chandu is not around. May I take a message?
    • Yes, I would be happy to pass this message.
    • I am sorry, I have to take this call. 
    • I am on the way home, could you please call me after half an hour?
    • I am on the way to office/bank/market, can I call back you after half an hour?
    • Hi, I missed your call(s), may I know who is this? 
    • I am going home
    • I am home

2 comments:

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version