Sunday 15 February 2015

పరిచయం

నన్ను మీరు చందు లేదా చంద్రం అని పిలవచ్చు. ప్రస్తుత competative world లో గెలవడం మాట పక్కన పెడితే అడుగెయ్యాలంటేనే కష్టంతరమయ్యే పరిస్తితి తయరైంది. ఈ సమస్యను అధిగమించడాలంటే communication ఒక వారధి లాంటిది. అలాంటి  పయనంలో English Language ఒక ఊతంలా సహయపడుతుంది.(గుర్తుంచుకోండి, English కేవలం ఊతం మాత్రమే, వారధి కాదు. World లో English భాష అక్షరమైనా వాడకుండా కూడా communicate చేసే వారిశాతం, English ఉపయోగించే వారికన్నా ఎక్కువ.)  

ఏదో ఉడుతా"శ"క్తితో నేనీ బ్లాగు మొదలుపెట్టాను. Posts వ్రాయడంలో సాధ్యమైనంత వరకూ ఇంగ్లీష్ పదాలే వాడాలని నిశ్చయించుకున్నాను. అందులోనూ వాడుక భాషనే ఎంచుకోదలచుకున్నాను.కాబట్టి తెలుగు భాషాభిమానులు ఎవరైన నొచ్చుకుంటే క్షమించాలని మనవి. తెలుగు భాషాభిమానులు కావాలంటే ఈ బ్లాగును సందర్శించవచ్చు. అక్కడ తెలుగు భాషకు సంబంధించిన సూచనలూ/సలహాలూ ఎంతో అవసరం.

ఈ బ్లాగు ముఖ్యోద్దేశ్యం, మీకు తెలిసిన భాషను వృధ్ధి చేసుకోవటమే గాని, కొత్తగా భాష  నేర్చుకోడానికి కాదని మనవి. కాబట్టి ఇంగ్లీష్ కొత్తగా నేర్చుకోడానికి అంతగా ఉపయోగ పడకపోవచ్చు. ఈ బ్లాగులో  ముఖ్యంగా ఈ క్రింది అంశాలమీద దృష్టి సారించబోతున్నాను.
- Common Errors
- Frequently used Words/phrases
- Frequently used sentences
- Writeup skills
- Tips on Professional Grooming  
- Email and Telephone Etiquettes

నేను విద్యా బోధనలో శిక్షణ పొందలేదు కాబట్టి మీరు కొంత నన్ను భరించక తప్పదు. కానీ Corporate wolrdలో గల Professional Experience  ఈ బ్లాగు వ్రాయడానికి ఉపయోగపడుతుందనీ, చిన్న చిన్న చిట్కాలు/సలహాలు పెద్ద మార్పులను తీసుకురావడానికి దోహదాలనీ భావిస్తూ ముందడుగుతో ముందుకు సాగుతూ.....

Yours,
చంద్రం


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version