Friday 27 February 2015

Wise People Use Name - Candy #4


Etiquette(మర్యాద) communicationలో ఒక ముఖ్యమైన భాగం.   ఈ పోస్ట్ లో పేరు, దానికి సంబంధించిన మర్యాదలను గురించి చర్చించదలచుకున్నాను. మొదట English మరియు Teluguలో ఈ పేరుకు సంబంధించిన cultural differences తెలుసుకుందాం.

తెలుగు, కన్నడ, మరాఠా ప్రజలు  ఎక్కువగా ఇంటిపేరును initial గా వాడుతుంటారు. ఇది ఇతర Indian cultures లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరైనా మన పేరడిగితే మనం ఇంటిపేరు తరువాత అసలుపేరు చెబుతాం. English communication లేదా Global culture లో ఇంటిపేరు కాస్తా Last name గా మారిపోతుంది, అసలుపేరుని First Name గా పిలుస్తారు. ఇంతవరకు బాగానే ఉంది అసలు సంగతి ఈ First name, Last name ల లోనే ఉంది.

Global culture లో ఎవరినైనా పిలవాలంటే వారి first name(అసలుపేరు) use చెయ్యాలి. వారు బాగా తెలిసినవారు, మీ వయసువారు స్నేహితులైతే తప్ప Last name ఉపయోగించకూడదు. Last nameతో పిలుపు చిన్నతనంగా భావిస్తారు(స్నేహితులు/పరిచయస్తులు Last name తో పిలుచుకోవడం quite common).  పొరపాటున కూడా Official communication/mail writingsలో Last name తో refer చెయ్యకండి.

కొన్నిసార్లు Last name తెలుసుకోవడం కష్టమౌతుంది, అటువంటి సందర్భాలలో వారినే అడిగి తెలుసుకోవడంలో ఎటువంటి తప్పులేదు. ఉదాహరణకి బీహార్ లోని కొన్ని వర్గాలవారికి Last name ఉండదు. వాళ్ళు First name నే Last name గా వాడుతారు(మా Friend ఒకతని పేరు అమిత్ అమిత్)
క్రిందటి పోస్ట్ లో చెప్పినట్టు పేరనేది Global cultureలో చాల Vital role play చేస్తుంది. వయసులో పెద్దవారిని మనం పేరు పెట్టి పిలవడానికి మొహమాట పడి Sir లాంటి పదాలు వాడుతాం. ఆ అలవాటుని మన ప్రాంతలోనే వదిలెయ్యాల్సి ఉంటుంది. ముఖ్యంగా యూరప్, లండన్ లో sir అని పిలవడాన్ని అవమానంగా భావిస్తారు, ఎదుటివారు తమని ఎక్కిరిస్తున్నారని భావిస్తారు. కాబట్టి ఎంత పెద్దవారైనా, గొప్పవారైనా పేరు పిలవడంలో తప్పులేదు. Exceptionally, professor,teacher, army officer దగ్గర sir అని పిలవచ్చు. ఏదెమైనా అక్కడి culture ముందుగా తెలుసుకొని తగ్గట్టుగా ప్రవర్తించడం మంచిది.  


  • ఇకనుంచి ఎవరైన బయటివారు(తెలుగువారు కాకుండా) మీ పేరడిగితే మీ పేరు మొదట చెప్పి తరువాత ఇంటిపేరు చెప్పండి. అనవసరమైన పదాలు జోడించకుండా పేరు పెట్టి పిలవడంలో no second thought. 
  • Writeup లో వ్రాసేటప్పుడు మొదటి అక్షరాన్ని Capital letterతో రాయాలి, లేకపోతే అది అశ్రద్ధకూ నిర్లక్ష్యానికి సంకేతం.  
    • Write Chandu not chandu
  • మొత్తం పేరుని Capital Letter లో రాయడం బట్టి మీరు అవతలి వారిపై కొంత కోపంగా ఉన్నట్టు సంకేతం. Try to avoid that.  
    • Never write CHANDU just write Chandu
Appendix : 
  • Etiquette : మర్యాద
  • Vital Role : ముఖ్యమైన పాత్ర
  • Exceptional : మినహాయింపు
  • Second Thought : పునః పరిశీలన

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version