Wednesday 25 February 2015

Why is 'best' the best - Candy#3

ఈ articleను కొద్దిగా గ్రామర్ కోణంలో వ్రాయబోతున్నాను. Grammar అంటే Boring అని తెలిసినా, పూర్తి వివరాల్లోకి వెళ్ళకుండా కావాల్సిన information ను మాత్రమే చర్చించబోతున్నాను. కాబట్టి కొంత విసుకనిపించినా ఓపిగ్గా చదవండి. It is just an FYI.
ఇంతకూ title విషయానికొస్తే ఇంతకు ముందటి article లో ఒక proverb/adage చర్చించుకున్నాం కదా 'First impression is the best impression'. ఈ sentence లో the best ఎందుకు వాడాల్సి వచ్చిందో తెలుసుకుందాం. English లో విశేషణాలు(Adjectives) విశేషమైన లక్షణాలు కలిగి ఉంటాయి. ఆ లక్షణాలను contextually రాబోవు Postsలో వివరిస్తాను. ప్రస్తుతానికి అటువంటి విలక్షణం గురించి తెలుసుకుందాం.

Adjectives మూడు రకాల రూపాలలో లభ్యమవుతాయి. Positive, Comparative  and Superlative. ఉదాహరణకు Good-Better-Best అనేవి good కి గల Degree of adjectives. ఇందులో positive form(good) adjective యొక్క సాధారణ గుణం కాగా Comparative(better) పోలికనుద్దేసిచినప్పుడు, Superlative(best) ను ఆ గుణం అత్యున్నతమైనదిగా అనుకున్నప్పుడు వాడతారు.

అసలు విషయానికొస్తే ప్రతి Superlative adjective కూడా ఖచ్చితంగా  'the' తో కలిసి రావాలి. ఉదాహరణకు the best person, the worst city, the least member, the most beautiful woman(not very beautiful) etc.... Rule లో ఎటువంటి twist లేనప్పటికీ ఒక మెలిక ఉంది. ఉదాహరణకు ఈ క్రింది sentences చూడండి.
Your mom knows best, they did their best, the goal was to best the competition.
Preceding examples అన్నీ కూడాఅ నియమబద్ధమైనవే, ఇక్కడ 'best' అనేది క్రమంగా(Respectively) adverb, noun, verb గా వాడబడింది. ఒక్క విశేషణ రూపంలోని Superlative form లో మాత్రమే 'the' ని వాడాలి. సూత్రప్రాయం కన్నా అనుభవసిద్ధంగా  ఈ వాడుక తేలిక అవుతుంది. కాకపోతే Rule తెలిసిఉండటం ఎంతో అవసరం.
Appendix : 

  • FYI :  సమాచార నిమిత్తము మాత్రమే (For Your Information). ఇదెందుకు an FYI, a FYI ఎందుకు కాకూడదు అనేది తరువాతి Posts లో చర్చించుకుందాం.
  • Proverb/Adage : జాతీయం/ పెద్దలమాట
  • Contextually : సందర్భానుసారంగా
  • Preceding : పైన చెప్పబడిన ( Opposite to 'following/succeeding')
  • very culture : very కి సంబంధించి ఒక Post రాయబోతున్నాను. ఇది one of the most abused words in English. ఇకనుండి ఎప్పుడైనా very వాడినప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అవసరమైతేనే తప్ప వాడకుండా ఉండటానికి ప్రయత్నించండి. 

2 comments:

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version