Tuesday 31 March 2015

Pronunciation Basics Part 1 - Candy #9

Spoken Languageకి ఉచ్చారణ ఊపిరి లాంటిది. మనం మాట్లాడింది ఎదుటివారు అర్ధం చేసుకోవాలన్నా, లేదా ఎదుటి వారు ఏం మాట్లాడారో తెలుసుకోవాలన్నా కేవలం Vocabulary మాత్రం తెలుసుకుంటే సరిపోదు. ఆ పదాన్ని ఏవిధంగా ఉచ్చరిస్తారో కూడా తెలుసుకోవాలి. భారతీయ భాషల్లో దాదాపుగా ప్రతి శబ్ధాన్నీ ఎలా వ్రాస్తామో అలానే ఉచ్చరిస్తాము. చాలా తక్కువ సందర్భాల్లో పద ఉచ్చారణ వ్రాతకు భిన్నంగా ఉంటుంది. ఉధాహరణకు Coffee ని 'కాఫీ' అని వ్రాస్తాము కానీ చదివేటప్పుడు వేరుగా చదువుతాము. ఎందుకంటే 'ఫీ'(కాఫీ లో 'ఫీ') మన వ్రాతబడి లో లేదు. ఇటువంటి విభిన్నాలు ఇంగ్లీషు భాషలో చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ముఖ్యంగా 'Silent letter' అనేది ఇంగ్లీషు  లేదా Germanic language ప్రభావిత భాషల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కోసారి రెండు, మూడు అక్షరాలను 'silent'   గా ఉంచాల్సివస్తుంది. ఉదాహరణకు Corps అనేది Armyలో ప్రత్యేక విధులను నిర్వర్తించే దళం. మరి దీన్ని ఎలా పలకాలంటే 'కార్ ' అని. విచిత్రంగా ఉంది కదా. ఇక్కడ 'p, s రెండు అక్షరాలు మౌనవ్రతాన్ని పాటించాయి.  దీన్ని కార్బ్స్ అని చదివితే ఈ పదం అర్ధం కాకపోవడం పక్కనుంచి దీన్ని మరోలా అర్ధం చేసుకునే ప్రమాదం ఉంది. (కార్బ్స్ అంటే కార్బో హైడ్రేట్స్ అని అర్ధం). అందుకే ఉచ్చారణకు తగినంత సమయం కేటాయించి మనకు తెలిసిన పదమైనా సరే దాన్ని ఎలా ఉచ్చరించాలో పరీక్షగా తెలుసుకోవడం మంచిది.
ఉచ్చారణని Pronunciation అంటారు. విచిత్రంగా ఈ పదాన్నే ఎక్కువమంది తప్పుగా పలుకుతుంటారు. దీనికి Pronoun కి దగ్గరి పోలికలున్నాయని కాబోలు దీన్ని ప్రొనౌన్సియేషన్ అని పలుకుతారు. దీన్ని ప్రొనన్సియేషన్ అని పలకాలి.  ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే దీని క్రియా రూపాన్ని ప్రొనౌన్స్(Pronounce) అనే పలకాలి. అవును కొంత తిక్కగా అనిపించినా ఇది తప్పని తిక్క. So, నేర్చుకోక తప్పదు.

మొదట Alphabets దగ్గరనుండి మొదలు పెడదాం. సాధారణంగా తప్పుగా ప్రొనౌన్స్ చేసే కొన్ని letters ని క్రింద వివరించాను.

  • A - దీన్ని 'ఎ ' అని పలుకుతాము. కానీ చాలాసార్లు ఇది 'అ ' రూపాన్ని ధరిస్తుంది. అప్పుడప్పుడు 'య ' అని కూడా పలకాల్సి వస్తుంది. ఉదాహరణకి About ని అబౌట్ అని, Anti ని ఏంటి అని Access ని యాక్సెస్ అని చదవాలి. 
  • E - ఇది 'ఇ ' గా, 'ఎ ' గా రూపాన్ని ధరిస్తుంది. ఉదాహరణకు 'Example' ని ఇగ్జాంపుల్ అని, Enter ని ఎంటర్ అని చదవాలి. Develop ని డివిలొప్ అని చదవాలి, డెవెలప్ కాదు.
  • H - ఇది నా Favorite letter. దీన్ని హెచ్ అని చదువుతాము. కాని ఎయ్చ్ అని పలకాలి. HDFC బాంక్ ని ఎయ్చ్.డి.ఎఫ్.చ్. అని పలకాలి. ఇక్కడ 'హ ' శబ్ధమే లేదు. ఏదైనా పదంతో కూడినప్పుడు మాత్రం హ రూపం బయట పడుతుంది. ఉదాహరణకు Hot ని హాట్ అని చదవాలి.దీనికి సంబంధించిన ఒక తమాషా సంఘటనని ఇక్కడ పోస్ట్ చేశాను. 
  • L, M, N, S - వీటిని ఎల్, ఎం, ఎన్, ఎస్ అని పలకాలి. మనం సాధారణంగా యల్, యం, యన్, యస్ అని పలుకుతాము.  
  • P, Q, T - వీటిని పలికేటప్పుడు  కొంత గాలి వదులుతూ చదవాలి. P ని ఫి , Q ని ఖ్యు, T ని ఒత్తు మరియు దీర్ఘం ఇస్తూ ఠీ అని పలకాలి.
  • Y - దీన్ని వాయ్ అని పలకాలి. 
  • Z - దీని ఉచ్చారణలో తప్పులేదు కాని, Americans దీన్ని జెడ్ కి బదులు జీ అని పలుకుతారు. కాబట్టి జీ అనంప్పుడు G దీనితో confuse అవ్వద్దు.   
మరిన్ని విశేషాలతో తరువాతి పోస్టులో కలుసుకుందాం. 


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version