Friday 13 March 2015

(ఇంగ్లీషు) భాషను అతి తొందరగా నేర్చుకోవడమెలా? - Candy #6

శీర్షికలో ఇంగ్లీషును parenthesis() మధ్య ఉంచడంలో నా ఉద్దేశ్యం, ఈ శీర్షిక కేవలం ఇంగ్లీషు కే పరిమితమైనది కాదని చెప్పడానికి.ఒకసారి మా నాన్నగారిని shortcutలో హిందీ నేర్పించమని అడిగితే 'There is no shortcut' అని చెప్పి నా ఉత్సాహానికి నీళ్ళు జల్లారు.  నాకు భలే కోపం వచ్చి, భాష నేర్చుకోవాలంటే మూర్ఖంగా గ్రామరు పుస్తకం Dictionary పట్టుకొని సంవత్సరాలపాటు కుస్తీ పడుతూ పోవాలా? అని అడిగాను. అంతే కాకుండా ఆరు నెలలలో అరవ సురేశ్ తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు కదా మరి తను చదివిన వ్యాకరణమేమిటో అని వ్యంగ్యంగా(Sarcastically) అడిగాను. దానికి తను చెప్పిన Sentence ను పొడిగిస్తూ,There is no shortcut but there is a purpose, what is your purpose అంటూ ఈ క్రింది  tips చెప్పారు. వాటినే మీతో పంచుకోబోతున్నానీవేళ
  • భాషను చదవటం నేర్చుకుంటే చదవడమే అలవాటవుతుంది, అదే మాట్లాడటం నేర్చుకుంటే మాట్లాడటం అలవాటవుతుంది. కాబట్టి Spoken English నేర్చుకోదలిస్తే మాట్లాడటం తప్పని సరి, దీనికి మరే shortcut లేదు.
  • భాషను కొత్తగా నేర్చుకునేటప్పుడు పదాలు(Vocabulary), వాక్యాలు నేర్చుకుంటాం. పదాన్ని ఏదైనా Sentenceలో మనంతట మనము ఉపయోగించినప్పుడే ఆ పదం మనం నేర్చుకున్నట్లు. కాబట్టి ఈ సారి ఈ క్రింది విధానాన్ని ప్రయత్నించి చూడండి. ఎవరైనా మాట్లాడినప్పుడో, ఎక్కడైనా movieలో చూసినప్పుడో, పుస్తకంలో చదివినప్పుడో ఎదైనా పదం అర్ధం కాకపోతే Dictionary చూస్తాం కదా, దానితో పాటు ఒక notebook పెట్టుకొని ఆ Sentence పూర్తిగా వ్రాసుకోండి. ఒకసారైనా ఆ వాక్యాన్ని వాడటానికి ప్రయత్నించండి. రెండూ మూడు సార్లు గనుక మీరు ఆ Sentence వాడినట్లైతే ఆ వాక్యాన్ని కొట్టివేయండి. ఎందుకంటే అది మీ మెదడులో గుర్తుండిపోతుంది. దాన్ని చదవాల్సిన అవసరం ఇక ఉండదు. అలా ఎన్ని వాక్యాలు కొట్టివేస్తారో అన్ని పదాలు నేర్చుకున్నాట్టు లెక్క. అంతేగాని work to word meaning నేర్చుకోవడం క్రిందకు రాదు. ఇది ఏ భాషకైనా వర్తిస్తుంది. 
  • మరో పద్దతిలో మీరు రోజూ మాట్లాడే వాక్యాలను తెలుగులో ఒకచోట వ్రాసుకొని వాటిని ఇంగ్లీషులో ఎలా పలుకాలో తెలుసుకోండి. ఎందుకంటే ప్రతిఒక్కరూ 50 నుండి 60 శాతం repeated sentences వాడతారు. కాబట్టి మీరు ఒక వారం పాటు వాడే వాక్యాలన్నింటినీ ఒకచోట వ్రాసుకొని వాటి ఇంగ్లీష్ Translation తెలుసుకొని practice చేసినట్లైతే 50-60% spoken English వచ్చినట్లే. 
           ఉదాహరణకు ఈ క్రింది sentences ని గమనించండి. వీటిని రోజుకు ఒక్కసారైనా వాడుతాం.
    • బండాపు/ కారాపు - Pull over the bike/pull over the card
    • నిద్రొస్తోంది - Feeling sleepy
    • ఫాన్ speed తగ్గించు - Turn down the fan speed. 
    • మిమ్మల్నెక్కడో చూసినట్లుంది - You look familiar to me
           ఇలాంటివి ఎన్నో వాక్యాలను repeated గా use చేస్తుంటాము.  అందుకే ప్రతీ పోస్టులోనూ నేను కొన్ని Sentences పరిచయం చేస్తున్నాను ఈ రీతిలో అతి తొందరగా/సులభంగా ఏదైనా భాషను నేర్చుకోవడం సాధ్యమౌతుంది. 

1 comment:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version