ఉచ్చారణని Pronunciation అంటారు. విచిత్రంగా ఈ పదాన్నే ఎక్కువమంది తప్పుగా పలుకుతుంటారు. దీనికి Pronoun కి దగ్గరి పోలికలున్నాయని కాబోలు దీన్ని ప్రొనౌన్సియేషన్ అని పలుకుతారు. దీన్ని ప్రొనన్సియేషన్ అని పలకాలి. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే దీని క్రియా రూపాన్ని ప్రొనౌన్స్(Pronounce) అనే పలకాలి. అవును కొంత తిక్కగా అనిపించినా ఇది తప్పని తిక్క. So, నేర్చుకోక తప్పదు.
మొదట Alphabets దగ్గరనుండి మొదలు పెడదాం. సాధారణంగా తప్పుగా ప్రొనౌన్స్ చేసే కొన్ని letters ని క్రింద వివరించాను.
- A - దీన్ని 'ఎ ' అని పలుకుతాము. కానీ చాలాసార్లు ఇది 'అ ' రూపాన్ని ధరిస్తుంది. అప్పుడప్పుడు 'య ' అని కూడా పలకాల్సి వస్తుంది. ఉదాహరణకి About ని అబౌట్ అని, Anti ని ఏంటి అని Access ని యాక్సెస్ అని చదవాలి.
- E - ఇది 'ఇ ' గా, 'ఎ ' గా రూపాన్ని ధరిస్తుంది. ఉదాహరణకు 'Example' ని ఇగ్జాంపుల్ అని, Enter ని ఎంటర్ అని చదవాలి. Develop ని డివిలొప్ అని చదవాలి, డెవెలప్ కాదు.
- H - ఇది నా Favorite letter. దీన్ని హెచ్ అని చదువుతాము. కాని ఎయ్చ్ అని పలకాలి. HDFC బాంక్ ని ఎయ్చ్.డి.ఎఫ్.చ్. అని పలకాలి. ఇక్కడ 'హ ' శబ్ధమే లేదు. ఏదైనా పదంతో కూడినప్పుడు మాత్రం హ రూపం బయట పడుతుంది. ఉదాహరణకు Hot ని హాట్ అని చదవాలి.దీనికి సంబంధించిన ఒక తమాషా సంఘటనని ఇక్కడ పోస్ట్ చేశాను.
- L, M, N, S - వీటిని ఎల్, ఎం, ఎన్, ఎస్ అని పలకాలి. మనం సాధారణంగా యల్, యం, యన్, యస్ అని పలుకుతాము.
- P, Q, T - వీటిని పలికేటప్పుడు కొంత గాలి వదులుతూ చదవాలి. P ని ఫి , Q ని ఖ్యు, T ని ఒత్తు మరియు దీర్ఘం ఇస్తూ ఠీ అని పలకాలి.
- Y - దీన్ని వాయ్ అని పలకాలి.
- Z - దీని ఉచ్చారణలో తప్పులేదు కాని, Americans దీన్ని జెడ్ కి బదులు జీ అని పలుకుతారు. కాబట్టి జీ అనంప్పుడు G దీనితో confuse అవ్వద్దు.
మరిన్ని విశేషాలతో తరువాతి పోస్టులో కలుసుకుందాం.